- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు: పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: తన ఫోన్ ట్యాప్(Phone Tap) చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) ఆరోపించారు. అంతేకాదు తమ కార్యకర్తల ఫోన్‌నెంబర్లు కలెక్ట్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Gannavaram Former Mla Vallabhaneni Vamsi)ని పరామర్శించేందుకు విజయవాడ సబ్ జైలు వద్దకు వెళ్లిన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ(Krishna District Sp) కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరుగుతోందన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లకు తాను భయపడనని పేర్ని నాని హెచ్చరించారు.
కాగా పీడీఎస్ రైస్ మాయం(PDS Rice Digestion) కేసులో పేర్ని నాని నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను పోలీసులు విచారించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే పేర్నినాని అరెస్ట్ అవబోతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఇప్పటికే తెలిపారు.
ఇదిలా ఉంటే ఇటీవల కూడా పేర్ని నానిపై ఓ కేసు నమోదు అయింది. గుంటూరు మిర్చి యార్డు వద్దకు వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆయన వెళ్లారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మిర్చి రైతుల పరామర్శకు అనుమతిలేదు. దీంతో కోడ్ ఉల్లంఘన కింద నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ మేరకు పేర్ని నాని మండిపడ్డారు. తప్పుడు కేసు అంటూ ఆయన ఖండించారు. డీజీపీ హరీశ్ గుప్తాకు లేఖ రాశారు. తనపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తన ఫోన్ ట్యాప్ చేశారంటూ నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.