మరో నాలుగేళ్లు తప్పదు: మాజీ మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర అసంతృప్తి

by Vemula.Srinu Prasad |

చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు...

మరో నాలుగేళ్లు తప్పదు: మాజీ మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర అసంతృప్తి
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా(Chittoor District)లో మామిడి రైతుల(Mango Farmers) పరిస్థితిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Former Minister Peddireddy Ramachandra Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది వారి పరిస్థితి దారుణంగా ఉందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు బీవీరెడ్డికాలనీలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో మామిడి కాయల కొనుగోలుకు కంపెనీలు క్యూ కట్టాయని, కానీ ఇప్పుడు ముందుకు రావడంలేదన్నారు. వైఎస్ జగన్(Ys Jagan) ప్రభుత్వంలో మామిడి రైతులకు అన్ని విధాలుగా మేలు కలిగిందని చెప్పారు. గత మూడేళ్లుగా కిలో మామిడిని సరాసరా రూ.25కు రైతులు అమ్మేవారని చెప్పారు. గత ఏడాది కిలో మామిడి రూ.27కు అమ్మారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కిలో మామిడిని రూ.3కు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రంలో మామిడి, మిర్చి, పొగాకు, టమోటా పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారని, మరో నాలుగేళ్ల పాటు ఈ ఇబ్బందులు తప్పవని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

Next Story