- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిథున్ రెడ్డితో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ములాఖత్
వైసీపీ బడా లీడర్, పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఏపీ లిక్కర్ స్కాం లో భాగంగా.. కీలకంగా

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ బడా లీడర్, పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఏపీ లిక్కర్ స్కాం లో భాగంగా.. కీలకంగా ఉన్న మిథున్ రెడ్డిని తాజాగా అరెస్టు చేశారు. అయితే రాజమండ్రి జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో తాజాగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూలాఖత్ అయ్యారు. ఈ మేరకు నిన్ననే జైలు అధికారుల నుంచి పర్మిషన్ తీసుకున్న పెద్దిరెడ్డి... ఇవాళ 12 గంటల సమయంలో... మిథున్ రెడ్డి తో మూలాఖత్ అయ్యారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు.. ఈ మూలాఖత్ కు మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ హోం మంత్రి తానేటి వనిత కూడా హాజరయ్యారు. ఈ తరుణంలోనే రాజమండ్రి సెంట్రల్ జైలులో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. అటు సెంట్రల్ జైలు వద్ద 144 సెక్షన్, సెక్షన్ 30 కూడా అమలు చేస్తున్నారు. అయితే ఈ మూలాఖత్ నేపథ్యంలో పెద్దిరెడ్డి వాహనాన్ని మాత్రమే పోలీసులు అనుమతించారు. దీంతో వైసిపి కీలక నేతలందరూ పెద్దిరెడ్డి వాహనంలోనే సెంట్రల్ జైలుకు వెళ్లారు.






