మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

by Ajay Maddhiboyina |

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బుగ్గమఠం భూముల వ్యవహారంలో ఏపీ హైకోర్డు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
X

దిశ‌, వెబ్ డెస్క్: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బుగ్గమఠం భూముల వ్యవహారంలో ఏపీ హైకోర్డు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రిట్ పిటిష‌న్ పై హైకోర్టు డివిజ‌న్ బెంచ్ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని ధ‌ర్మాసనం పేర్కొంది. కేసు మెరిట్స్‌లోకి తాము వెళ్లడం లేదని స్పష్టం చేసింది. హైకోర్టు మెరిట్స్ ఆధారంగా చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది.నేటి నుండి రెండు వారాల పాటు యథాస్థితిని కొనసాగించాలని పేర్కొంది. పెద్దిరెడ్డి పిటిష‌న్ పై విచార‌ణ‌ను ముగించింది. ఇదిలా ఉంటే తిరుపతిలోని బుగ్గమఠానికి చెందిన 3.88 ఎకరాల భూమిని పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించారని దేవాదాయశాఖ నిర్దారించింది. దీంతో దేవాదాయశాఖ కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు అనుకూలంగా తీర్పు రాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది.

Next Story