- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దమ్ముంటే ఆ పని చేయండి: లోకేశ్, పవన్‌కు పేర్ని నాని సవాల్
దమ్ముంటే తమ అకౌంట్ కాపీలు చూపించాలని మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు....

దిశ, వెబ్ డెస్క్: దమ్ముంటే తమ అకౌంట్ కాపీలు చూపించాలని మంత్రి లోకేశ్(Minister Lokesh), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) సవాల్ విసిరారు. వైఎస్సార్ కాంగ్రె పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్(Ys Jagan) పర్యటన ఫ్లైట్ ఖర్చులపై కూటమి నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమానాల్లో తిరిగేందుకు వారానికి రూ. 20 లక్షలు అవుతోందని పేర్ని నాని ఆరోపించారు. ఆ డబ్బులు ఎవరు కడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్ము ఖర్చు చేయకుండా లోకేశ్, పవన్ తిరుగుతున్నారని అంటున్నారని, ఇన్ని సార్లు తమర్ని తిప్పుతుందో ఎవరో చెప్పాలన్నారు. లోకేశ్, పవన్ తిరిగే విమానాల ఖర్చు ఎవరు పెడుతున్నారో బయటపెట్టాలన్నారు. రైతుల దగ్గర ఎకరం 99 పైసలకు తీసుకుంటున్న వాళ్లు కడుతున్నారా అని నిలదీశారు. బినామీల డబ్బు పెట్టి తిరుతున్నారా.? అని పేర్ని నాని ప్రశ్నించారు.
అమరావతి విస్తరణలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న రెండో దశ భూసేకరణపైనా పేర్నినాని విమర్శలు చేశారు. అమరావతి రైతులను చంద్రబాబు నట్టేట ముంచుతున్నారన్నారు. జగనే న్యాయం చేశారని అమరావతి రైతులు అంటున్నారని తెలిపారు. ‘‘తప్పుడు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట. ప్రజాస్వామ్యాన్ని తప్పుడుదారిలో నడిపించడంలో చంద్రబాబు వింతపోకడలు పోతున్నారు. ఓ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించారు. వ్యక్తులను ప్రలోభాలకు గురిచేయటంలో ఆయనకు ఆయనే సాటి. చంద్రబాబు రాజకీయ అనైతిక క్రీడలో భాగమే మా పార్టీ ఎమ్మెల్సీల రాజీనామాలు.’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.






