పవన్ కల్యాణ్ చేతబడి మాంత్రికుడా: కళ్ల దిష్టి వ్యాఖ్యలపై పేర్ని నాని విమర్శలు

by Vemula.Srinu Prasad |

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతబడి మాంత్రికుడా అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు...

పవన్ కల్యాణ్ చేతబడి మాంత్రికుడా: కళ్ల దిష్టి వ్యాఖ్యలపై పేర్ని నాని విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) చేతబడి మాంత్రికుడా అని మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) అన్నారు. కోనసీమ కొబ్బరిచెట్లు(Konaseema coconut trees) ఎండిపోవడానికి దిష్టినే కారణమని ఏపీ విభజన, తెలంగాణ ఏర్పాటును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. పవన్‌కు చేతబడి విద్యలు తెలుసేమోనని ఎద్దేవా చేశారు. అసలు దిష్టి తగలడమేంటని ఆయన ప్రశ్నించారు. కళ్ల దిష్టి వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో అన్నారా..?, మాంత్రికుడి హోదాల అన్నారా అని ప్రశ్నించారు. సైంటిస్టులను తీసుకొచ్చి కొబ్బరి చెట్లకు వచ్చిన వ్యాధి ఏంటో తెలుసుకుని, వాటిని బతికించాలని, రైతులకు జీవం పోయాలని సూచించారు. ఏపీతో పోటీ పడి తెలంగాణలో వరి, ఉద్యావన పంటలు పండిస్తున్నారని పేర్ని నాని చెప్పారు. టెక్నాలజీ మారిపోయిన తర్వాత ఇంకా కళ్ల దిష్టి, చేతబడులు, మంత్రాలు ఉంటాయా అని ప్రశ్నించారు. పరిపాలన చేతకాకనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని పేర్నినాని విమర్శించారు.

Next Story