సంఖ్యాబలం లేదు.. ఆయనపై అవిశ్వాసం ఎలా పెడతారు: ఎమ్మెల్సీ బొత్స

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-06 09:09:36  IST  )

శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు పై అవిశ్వాసం పెట్టాలన్న టీడీపీ ఎమ్మెల్సీల వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు..

సంఖ్యాబలం లేదు.. ఆయనపై అవిశ్వాసం ఎలా పెడతారు: ఎమ్మెల్సీ బొత్స
X

దిశ, వెబ్ డెస్క్: శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు(Legislative Council Chairman Moshen Raju)పై అవిశ్వాసం పెట్టాలన్న టీడీపీ(Tdp) ఎమ్మెల్సీల వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Mlc Bosta Satynarayana) స్పందించారు. ఏపీ అసెంబ్లీ(Ap Assembly)లో నిర్వహించిన చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ అసలు సంఖ్యాబలం లేకుండా మండలి చైర్మన్‌పై అవిశ్వాసం ఎలా పెడతారని బొత్స ప్రశ్నించారు. లడ్డూ అంశంలో తాము చెప్పాలనుకుంది సభలోనే చెప్పామన్నారు. హరిటేజ్(Heritage), ఇందాపూర్(Indapur) మధ్య సంబంధముందని బొత్స మరోసారి సైతం వ్యాఖ్యానించారు.

ఎక్కువ ధరకు హెరిటేజ్‌ నెయ్యి


ఇందాపూర్ ద్వారా నెయ్యి సరఫరా జరుగుతోందని బొత్స సత్యనారాయణ తెలిపారు. బయట మార్కెట్‌లో హెరిటేజ్ నెయ్యి కిలో రూ.600 కాగా ఇందాపూర్ డెయిర్ కిలో నెయ్యి రూ. 658కి సరఫరా చేస్తోందని తెలిపారు. ధర తక్కువగా ఉంటే హెరిటేజ్ కల్తీ నెయ్యి అనుకోవాలా అని ప్రశ్నించారు. నెయ్యి వివాదాన్ని తిరుమల వెంకన్నే చూసుకుంటారని బొత్స వ్యాఖ్యానించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికల జరిగినా తామే గెలుస్తామని దీమా వ్యక్తం చేశారు. అంగన్ వాడీలకు తమ పార్టీ అండగా ఉంటుందని బొత్స పేర్కొన్నారు.

Next Story