- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మంత్రి కుతూహలమ్మ కన్నుమూత
ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ(73) కన్నుమూశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ(73) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె బుధవారం వేకువజామున తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆమె 2014లో టీడీపీలో చేరారు.
ఏడాదిన్నర క్రితం టీడీపీకి రాజీనామా చేశారు. కుతూహలమ్మ 1985లో వేంపజెరి( ప్రస్తుతం జీడీ నెల్లూరు) నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే స్థానం నుంచి 1989, 1999, 2004లోనూ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. దివంగత మాజీ సీఎం జనార్ధన్ రెడ్డి హయాంలో వైద్యారోగ్యం, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగారు.
2007లో ఏపీ శాసన సభ డిప్యూటీ స్పీకర్ గా సేవలందించారు. 1994లో కాంగ్రెస్ సీటు నిరాకరించడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీలో చేరిన ఆమె జీడీ నెల్లూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.






