తమ్ముడు.. పిచ్చి పిచ్చి మాటలొద్దు: టీడీపీ ఎంపీకి మాజీ మంత్రి కేటీఆర్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-11 15:02:41  IST  )

తమ్ముడు పిచ్చి పిచ్చి మాటలొద్దని టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ..

తమ్ముడు.. పిచ్చి పిచ్చి మాటలొద్దు: టీడీపీ ఎంపీకి మాజీ మంత్రి కేటీఆర్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: తమ్ముడు పిచ్చి పిచ్చి మాటలొద్దని టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయ(Tdp Mp Srikrishnadevaraya)పై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌(Parliment)లో తెలంగాణ(Telangana)పై ఎంపీ శ్రీకృష్ణదేవరాయ చేసిన కామెంట్స్‌పై ఆయన స్పందించారు. తెలంగాణ(Telangana) ఏర్పడి 12 ఏళ్లు అయిపోయిందని, అభివృద్ధిలో దూసుకుపోతోందని కేటీఆర్ గుర్తు చేశారు. ‘‘నువ్వు మా తమ్ముడివి. యువకుడివి. వేరేవాళ్ల గురించి తప్పుడు మాటలు మాట్లాడాల్సిన ఖర్మ మాకు లేదు. ఏపీ, తెలంగాణ బాగుండాలని మేం కోరుకుంటున్నాం. ఏపీ అభివృద్ధిపై, చంద్రబాబు చేస్తున్న మంచి పనులపై మాట్లాడాలి. తెలంగాణపై ఏడుపులు బంద్ చేయాలి.’’ అని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.

కేటీఆర్ ఆడియో..

మీ పదేళ్ల పాల‌నలో ప్రతిరోజు చీక‌టి రోజే.. కేటీఆర్‍కు ఆది శ్రీనివాస్ కౌంటర్

Next Story