కొడాలి నానిపై సోషల్ మీడియాలో సంచలన ప్రచారం.. రియాక్షన్ ఇదే..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-25 13:34:43  IST  )

మాజీ మంత్రి కొడాలి నానిపై సోషల్ మీడియాలో జరుగుతున్న సంచలన ప్రచారంపై ఆయన స్పందించారు..

కొడాలి నానిపై సోషల్ మీడియాలో సంచలన ప్రచారం.. రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party)కి ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి(VijayaSai Reddy) గుడ్ బై చెప్పడం, రాజ్యసభ చైర్మన్ ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. అయితే వైసీపీలో నెంబర్ 2 వెళ్లిపోవడంతో సోషల్ మీడియాలో దుష్ప్రప్రచారం ఊపందుకుంది. వైసీపీ(Ycp)కి చాలా మంది సీనియర్ నేతలు కూడా రాజీనామా చేయబోతున్నారంటూ కామెంట్లు, పోస్టులు, మెసేజులు వెల్లువెత్తాయి. అంతేకాదు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌(Ys Jagan)ను అంటిపెట్టుకుని ఉండే మాజీ మంత్రి కొడాలి నాని(Former Minister Kodali Nani) సైతం పార్టీకి దూరవుతున్నారనే ప్రచారం చక్కెర్లు కొట్టింది. పలు ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారని, త్వరలోనే పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు కొందరు పెట్టిన పోస్టులు వైరల్‌గా మారాయి.

దీంతో కొడాలి నాని స్పందించారు. తాను వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, అది ఫేక్ అని కొట్టిపారేశారు. తన ట్వీట్‌ను ఎడిట్ చేసి వైరల్ చేశారని చెప్పారు. దాన్ని ఎవరూ నమ్మవద్దని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని, తనను కలవొచ్చని ట్విట్టర్ ద్వారా కొడాలి నాని పిలుపునిచ్చారు.

Next Story