- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: ఏపీ హైకోర్టులో కొడాలి నానికి ఊరట
మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది...

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani)కి హైకోర్టు(High Court)లో ఊరట లభించింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. 35(3) కింద నోటీసులు ఇచ్చిన తర్వాతనే తదుపరి చర్యలు ఉండాలని సూచించింది. విశాఖలో నమోదు అయిన కేసుకు సంబంధించిన ఆయన కోర్టును ఆశ్రయించడంలో న్యాయమూర్తి(Judge) కీలక ఆదేశాలు జారీ చేశారు.
కాగా వైసీపీ(Ycp) అధికారంలో ఉన్న సమయంలో మంత్రి పని చేసిన కొడాలి నాని.. అప్పటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు(Tdp Chief Chandrababu), ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh)పై బూతులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో వైసీపీ ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పట్లో అనుచితంగా వ్యవహరించిన నేతలు, కార్యకర్తలపై అందించిన ఫిర్యాదుల మేరకు రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదు అయ్యాయి. మాజీ మంత్రి కొడాలి నానిపై నవంబర్ 24న విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషల్‌లో ఏయూ కాలేజీ విద్యార్థిని ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, లోకేశ్‌పై కొడాలి తిట్టిన బూతులను భరించలేకపోయామని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కొడాలిపై ఆ సమయంలోనే కేసు నమోదు అయింది.
అయితే రాష్ట్రంలో వరుసగా వైసీపీ నేతలపై కేసులు, అరెస్ట్ లు జరుగుతున్నా నేపథ్యంలో కొడాలి నానికి కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఓ కేసుకు సంబంధించి ఇటీవల కొడాలి నాని అనుచరులకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో అప్రమత్తమైన కొడాలి నాని.. ముందస్తుగా హైకోర్టును ఆశ్రయించారు. విశాఖలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించింది.






