- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలి: Kodali Nani
చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు యమరథంతో ప్రజలను చంపుతున్నాడని ఆరోపించారు. రెండు సభల పేరుతో బాబు 11 మంది అమాయక ప్రజలను బలిగొన్నాడని విమర్శించారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలవుతున్నారని ఫైర్ అయ్యాడు. వారి వైఫల్యం వల్ల జరిగిన నేరాన్ని పోలీసులపై నెడుతున్నారని అన్నారు. ఇకపై రాష్ట్రంలో చంద్రబాబు బహిరంగ సభలకు అనుమతి ఇవ్వొద్దని కొడాలి నాని డిమాండ్ చేశారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లాలోని కందూకురులో నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృత్యవాత పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే ఆదివారం గుంటూరు జిల్లాలో నిర్వహించిన సభలో మరోసారి తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మరణించారు.
Also Read...
Next Story






