ఆ గొడ్డలితోనే తెగనరుకుతారు: కొడాలి నాని వార్నింగ్

by Vemula.Srinu Prasad |

టీడీపీది ‘పచ్చ గొడ్డలి పార్టీ’ అని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాన్ని గుడివాడలో నిర్వహించిన ఆయన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు...

ఆ గొడ్డలితోనే తెగనరుకుతారు: కొడాలి నాని వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ(Tdp)ది ‘పచ్చ గొడ్డలి పార్టీ’ అని మాజీ మంత్రి కొడాలి నాని(Former Minister Kodali Nani) విమర్శించారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాన్ని గుడివాడ(Gudiwada)లో నిర్వహించిన ఆయన సీఎం చంద్రబాబు(Cm Chandrababu), మంత్రి లోకేశ్‌(Minister Lokesh)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీది గొడ్డలి పార్టీ అని చేస్తున్న విమర్శలకు కొడాలని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2029 ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్‌కు పరశురాముడి గొడ్డలిని అందిస్తారని దీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో టీడీపీకి పరశురాముడిలా జగన్ రాజకీయ సమాధి కట్టడం ఖాయమని కొడాలి నాని హెచ్చరించారు.

హామీ ఇచ్చి తప్పారు..

సూపర్ సిక్స్‌లో భాగంగా సీఎం చంద్రబాబు ప్రతి నెలా మహిళకు రూ.1500 ఇస్తామని చెప్పారని, ఆ మాట తప్పారని మండిపడ్డారు. ఇప్పటివరకూ ప్రతి మహిళకు రూ. 30 వేలు బాకీ ఉందని చెప్పారు. నిరుద్యోగులను సైతం మోసం చేశారని ఆరోపించారు. మెగా డీఎస్సీలో అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఈ రెండేళ్లలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఆరోపించారు. సంపద సృష్టిస్తామని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కొడాలి నాని ధ్వజమెత్తారు.

Next Story