యాదవులను కించపర్చలేదు.. కావాలనే రాద్ధాంతం: కూటమిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం

by Vemula.Srinu Prasad |

యాదవ వర్గం వ్యక్తిని జగన్ కించర్చినట్లు కూటమి నేతలు రాద్దాంతం చేస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ..

యాదవులను కించపర్చలేదు.. కావాలనే రాద్ధాంతం: కూటమిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) యాదవ వర్గానికి(Yadava) చెందిన వ్యక్తిని కించర్చినట్లు కూటమి నేతలు రాద్దాంతం చేస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు(Former Karumuri Nageswararao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ చిన్న మాటను పట్టుకుని అధికారపార్టీ తమపై బురదజల్లుతోందని ఆయన మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆయన మాట్లాడుతూ నాయీబ్రాహ్మణులను, ఎస్సీలను కించపర్చిన వ్యక్తి చంద్రబాబు(Chandrababu) అని వ్యాఖ్యానించారు. ‘గోపీనాథ్ జెట్టి అనేటోడు’ అని జగన్ అన్నాడని, దాన్ని పట్టు్కుని చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కూటమి పాలనలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో యాదవులకు మంచి జరిగిందని గుర్తు చేశారు. కూటమి పాలనలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమలలో గొల్లమండపాన్ని కూల్చింది ఎవరు అని ప్రశ్నించారు. యాదవులకు తిరుమలలో వంశపార్యహక్కును వైఎస్ జగన్ కల్పించారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో యాదవులకు ఎమ్మెల్సీ ఇచ్చిన ఘన చరిత్ర జగన్‌దని వ్యాఖ్యానించారు. విశాఖ మేయర్ గా పని చేసిన యాదవ మహిళ పట్ల ఎలా వ్యవహరించారో ప్రజలకు తెలుసని కారుమూరి నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు.

Next Story