మద్యం రవాణా టెండర్ల కేసు... చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ నేత

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-23 08:50:51  IST  )

మద్యం రవాణా టెండర్ల అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్ సిట్ (SIT) విచారణకు గైర్హాజరయ్యారు. ...

మద్యం రవాణా టెండర్ల కేసు... చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ నేత
X

దిశ, వెబ్ డెస్క్: మద్యం రవాణా టెండర్ల అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్ సిట్ (SIT) విచారణకు గైర్హాజరయ్యారు. గతంలో సిట్ అధికారులు జారీ చేసిన నోటీసుల ప్రకారం వారు ఈరోజు విచారణాధికారుల ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో అధికారులకు కారుమూరి నాగేశ్వరరావు లేఖ రాశారు.

భార్యకు అనారోగ్యం కారణంగా...

తన భార్యకు ఆరోగ్యం బాగోలేదని, ఆమె బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఉన్నందున ప్రస్తుతం విచారణకు రాలేనని లేఖలో నాగేశ్వరరావు పేర్కొన్నారు. అలాగే తమకు మరో వారం రోజుల పాటు గడువు కావాలని కోరారు. మరోవైపు ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించిన అధికారులు, వీరి విచారణ ద్వారా మరిన్ని వివరాలు రాబట్టాలని భావించారు. వారం రోజుల గడువు ఇస్తారా లేక మరోసారి నోటీసులు జారీ చేసి తక్షణమే హాజరుకావాలని ఆదేశిస్తారా అన్నది వేచి చూడాలి.

సొంత వారినీ చంపేస్తున్నారు: వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు

Next Story