మాజీ మంత్రి కాకాణికి దెబ్బమీద దెబ్బ.. మరో రెండు కేసులు నమోదు

by Kema Shiva Kumar |

క్వార్ట్జ్ ఖనిజం అక్రమ తవ్వకాల కేసులో ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి (Kakani Goverdhan Reddy) మరో ఊహించని షాక్ తగిలింది.

మాజీ మంత్రి కాకాణికి దెబ్బమీద దెబ్బ.. మరో రెండు కేసులు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: క్వార్ట్జ్ ఖనిజం అక్రమ తవ్వకాల కేసులో ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి (Kakani Goverdhan Reddy) మరో ఊహించని షాక్ తగిలింది. ఈ మేరకు తాజాగా ఆయనపై మొత్తం రెండు కేసులు నమోదయ్యాయి. కృష్ణపట్నం పోర్టు (Krishnapatnam Port)కు వెళ్లే దారిలో అక్రమంగా టోల్‌గేట్ ఏర్పాటు చేసి కంటైనర్లు, ఇతర వాహనాల నుంచి పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ముత్తుకూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. అదేవిధంగా సర్వేపల్లి (Sarvepally)లో గ్రావెల్‌ (Gravel)ను అక్రమంగా తరలించారని కాకాణితో పాటు మరో ఇద్దరిపై కేసు బుక్ అయింది.

కాగా, క్వార్ట్జ్ అక్రమంగా తవ్వకాలు జరిపిన కేసులో పోలీసులు కాకాణిని మూడు రోజుల పాటు విచారించారు. అదివారం సాయంత్రంలో విచారణ ముగిసింది. రెవెన్యూ, మైనింగ్ అధికారుల సమక్షంలో డీఎస్పీ శ్రీనివాస్ (DSP Srinivas) ఆధ్వర్యంలో మాజీ మంత్రిని మొత్తం 40 ప్రశ్నలు అడిగారు. పలు ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేసినట్లుగా సమాచారం. అయితే, క్వార్ట్జ్ మైనింగ్ వ్యవహారంలో తన ప్రమేయం లేదని, కావాలనే తప్పుడు కేసు పెట్టారంటూ కాకాణి చెప్పినట్లుగా తెలుస్తోంది.

Next Story