- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరింత ఉధృతం చేస్తాం.. ప్రభుత్వానికి కాకాణి స్ట్రాంగ్ వార్నింగ్
యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి కాకాణి అన్నారు...

దివ, వెబ్ డెస్క్: సాగుకు అవసరమైన యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy) అన్నారు. నెల్లూరు జిల్లా వ్యవసాయ కార్యాలయం(Nellore District Agriculture Office) వద్ద రైతులతో కలిసి ఆయన ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాణి రైతుకు గిట్టుబాటు ధర లేక ఇప్పటికే తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు యూరియా కూడా దొరక్కపోవడంతో అన్నదాతలపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రభుత్వం చేస్తున్న ద్రోహానికి ఇది పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉచిత పంటల భీమా అటకెక్కించారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇన్‌పుట్ సబ్సిడీ లేదని, గిట్టుబాటు ధర లేదని, ఇప్పుడు యూరియా కూడా లేకుండా చేస్తే రైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు. యూరియా(Urea) కొరకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు సమీక్షా సమావేశలు పెట్టి అధికారులకు ఆదేశాలు ఇస్తారనుకుంటే ఎక్కడా ఆ పరిస్థితి కనబడటం లేదన్నారు. టీడీపీ నేతలకు వారికి కావాల్సిన వారికి మాత్రమే అంతంత మాత్రంగా యూరియా ఇస్తూ, మిగిలిన రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకి వ్యవసాయం అంటే నిర్లక్ష్యమని, రైతులంటే అసహ్యమని, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని పెట్టుబడి సాయం అందించారని గుర్తు చేశారు. పంటలు వేసుకున్న వెంటనే ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చెయ్యడం, ఈ క్రాప్ అయిన వారికి ఉచిత పంటల బీమా అందించారని తెలిపారు. అధికార పార్టీ నేతలు, ప్రైవేట్ డీలర్లతో కుమ్మక్కై రైతులకు అందాల్సిన యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 267.50 కాగా, మార్కెట్‌లో రైతులు బస్తాకు రూ. 450 నుండి రూ. 500 వరకు అధిక ధర చెల్లించాల్సి వస్తోందని కాకాణి వ్యాఖ్యానించారు.
గిట్టుబాటు ధర కల్పిచాం
‘‘గత వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు సజావుగా రైతులకు అందించి, పంటలకు గిట్టు బాటు ధర కల్పిచాం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసి దళారీలకు కొమ్ముకాస్తోంది. యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది, సాగు పనులు వదిలేసి ఎరువుల కోసం తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు, రైతులకు అందాల్సిన యూరియాని లారీలలో దిగిన వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు ట్రాక్టర్‌లలో అక్రమంగా అన్యాయంగా తరలించకపోతుంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు, చంద్రబాబు వ్యవసాయం ఎందుకు దండగ అంటూ, బియ్యం ఎవరూ తినడం లేదని, అందరూ చపాతీలు, రొట్టెలు తింటున్నారని అంటున్నాడు, నెల్లూరు జిల్లాకు వరప్రదాయని లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను అర్ధాంతరంగా ఆపేశాడు, రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తాము రహస్య సమావేశం నిర్వహించుకుని, చెప్పిన పిదప రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ఆపేశాడని తెలిపితే దానిమీద నోరు మెదపలేక డైవర్సన్ పాలిటిక్స్ మాట్లాడుతున్నాడు, యూరియా కొరతను వెంటనే తీర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. రైతుల సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే వైయస్ఆర్ సీపీ నేతృత్వంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం.’’ అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.






