పోలీసుల అదుపులో మాజీ మంత్రి కాకాణి.. కాసేపట్లో వెంకటగిరి కోర్టుకు

by Kema Shiva Kumar |

క్వార్ట్జ్‌ (Quartz) అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, తదితర అభియోగాలపై ఇటీవలే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు (Nellore) జిల్లా పొదలకూరు (Podalakuru) పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే.

పోలీసుల అదుపులో మాజీ మంత్రి కాకాణి.. కాసేపట్లో వెంకటగిరి కోర్టుకు
X

దిశ, వెబ్‌డెస్క్: క్వార్ట్జ్‌ (Quartz) అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, తదితర అభియోగాలపై ఇటీవలే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు (Nellore) జిల్లా పొదలకూరు (Podalakuru) పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనను ఎఫ్ఐఆర్‌లో A4 నిందితుడిగా చేర్చారు. అయితే, అప్పటి నుంచి కాకాణి గత నెల రోజులుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన ఆచూకీ కోసం జల్లెడ పట్టిన పోలీసులు ఆదివారం బెంగళూరు (Bengaluru) సమీపంలో అరెస్ట్ చేసి నెల్లూరుకు తీసుకొచ్చారు. జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ఆయనను ఉంచారు. దీంతో ప్రస్తుతం DTC వద్దకు పోలీసులు మీడియాను అనుమతించట్లేదు. డీటీసీకి కిలోమీటరు దూరంలోనే పోలీసు వాహనాలు మినహా ఇతర వాహనాలకు నిలిపివేసి వెనక్కి పంపుతున్నారు. కాసేపట్లో కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు వెంకటగిరి (Venkatagiri) కోర్టులో హాజరుపరచనున్నారు.

Next Story