Ap News: అజ్ఞాతం వీడిన కాకాణి.. కీలక కామెంట్స్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-01 11:19:28  IST  )

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు...

Ap News: అజ్ఞాతం వీడిన కాకాణి.. కీలక కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy) ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. ఈ రోజు విచారణకు హాజరుకావాల్సి నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా(Nellore District)లో మైనింగ్ తవ్వకాల(Mining Excavations) వ్యవహారంలో జరిగిన అవకతవకలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏ4గా చేర్చారు. ఈ మేరకు ఆయన నోటీసులు ఇచ్చేందుకు రెండు సార్లు పోలీసులు ప్రయత్నం చేశారు. నెల్లూరులో ఆయన ఇంటి దగ్గర రాలేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. విచారణకు హాజరుకావాలని సూచించారు. మరోసారి హైదరాబాద్ వెళ్లి కాకాణి బంధువులకు నోటీసులు అందజేశారు. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని సూచించారు.

అయితే పోలీసుల విచారణకు కాకాణి హాజరుకాలేదు. కానీ మీడియా ముందుకు వచ్చారు. పోలీసులు తనపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదని, తాను ఇంట్లోనే ఉన్నానని తెలిపారు. తాను నెల్లూరులో లేని సమయంలో తన ఇంటి గోడకు పోలీసులు నోటీసులు అంటించి వెళ్లారని ఆరోపించారు. బెయిల్ రాకుండా చేయాలనే కుట్రలో భాగంగానే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. కేసులను తాను భయపడే వ్యక్తిని కాదని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. ఆధారాలు చూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని చాలెంజ్ చేశారు. పోలీసుల విచారణకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 24 గంటలకు పైన సమయం ఇచ్చి రమ్మంటే వెళ్తానని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story