- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ పోలీస్ కస్టడీకి మాజీ మంత్రి.. మరో రెండు రోజులపాటు విచారణ
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీ(Custody)కి తీసుకున్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy)ని పోలీసులు కస్టడీ(Custody)కి తీసుకున్నారు. అక్రమ టోల్ గేట్ కేసులో ఆయనపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో మరింత విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని పోలీసులో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ మేరకు కాకాణి(Kakani Govardhan Reddy)ని ఈ రోజు, మంగళవారం విచారించనున్నారు. నెల్లూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్(Nellore Police Training Center)లో ఆయనను విచారించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులోనూ ఆయనను కస్టడీకి తీసుకుని విచారించారు. ప్రస్తుతం ఈ కేసులోనూ ఆయనను పోలీసులు మరింత విచారించనున్నారు.
Next Story






