‘సర్’ ప్రక్రియలో అధికార పార్టీ నేతల జోక్యం.. మాజీ మంత్రి తీవ్ర ఆగ్రహం

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ 14తో ప్రక్రియ ముగియనుండటంతో అధికారులు, స్థానిక నేతలు వేగం పెంచారు. సర్ నమోదు కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేశారు...

‘సర్’ ప్రక్రియలో అధికార పార్టీ నేతల జోక్యం.. మాజీ మంత్రి తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ 14తో ప్రక్రియ ముగియనుండటంతో అధికారులు, స్థానిక నేతలు వేగం పెంచారు. సర్ నమోదు కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేశారు. నెల్లూరులో స్వయంగా మంత్రి నారాయణ దగ్గరుండి సర్ ప్రక్రియ నమోదు చేయించారు. చాలా ప్రాంతాల్లో టీడీపీ నేతలు సైతం సర్ ప్రక్రియ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్ ప్రక్రియ నమోదులో టీడీపీ నేతల జోక్యంపై ఆయన మండిపడ్డారు. బూత్ లెవల్ ఆఫీసర్లతో మంత్రి నారాయణ సర్ప్రైజ్ సమీక్ష నిర్వహించారని, వెంటనే ఆయన్ను బర్త్ రఫ్ చేయాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.

ముట్టడిస్తాం..


ఓట్ల జాబితాలో తమ ఓట్లు లేకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని కాకాణి హెచ్చరించారు. మంత్రి హోదాలో మంత్రి నారాయణ ప్రలోభాలకు గురి చేయడానికి వెళ్లారని వ్యాఖ్యానించారు. అసలు బీఎల్వో సమావేశం ఏర్పాటు చేసే హక్కు ఉందా అని, మంత్రిపై ఎందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. తమ ఓటు హక్కును తాము కాపాడుకుంటామని చెప్పారు. ఓటర్ల జాబితాలో తమ సానుభూతి పరుల ఓట్లు లేకపోతే ఎన్ని కేసులు పెట్టుకున్నా ఊరుకునే పరిస్థితి ఉండదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.

Next Story