ప్రాణాలైనా అర్పిస్తాం..రాజీపడం: కాకాణి

by Vemula.Srinu Prasad |

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు...

ప్రాణాలైనా అర్పిస్తాం..రాజీపడం: కాకాణి
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minsiter Kakani Goverdhan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu), జోగి రమేశ్(Jogi Ramesh) కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అవినీతి అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో అవసరమైతే ప్రాణాలు సైతం అర్పిస్తామని, రాజీమాత్రం అవ్వమని తేల్చి చెప్పారు. వైసీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి వేధించిన అధికారులకు కూటమి నేతలు నజరానాతో పాటు ప్రమోషన్లు సైతం ఇస్తున్నారని కాకాణి ఆరోపించారు. ఎప్పుడూ లేని విధంగా వైసీపీ నేతల ఇంటిపై దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. పెట్రోల్ పాటు యాసిడ్ దాడులు చేశారని వ్యాఖ్యానించారు. జోగి రమేశ్ ఇంటిపై దాడి చేయడంతో పాటు కేసు కూడా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకని కూటమి నాయకులు అరాచకాలను పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ విషయంలో కూటమి నేతలు అబద్ధాలు ప్రచారం చేశారన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసినందుకే తమను అరెస్ట్ చేయించారని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

Next Story