- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిటైర్డ్ అయినా వదలం: ఇరిగేషన్ అధికారులకు మాజీ మంత్రి వార్నింగ్
ఇరిగేషన్ అధికారులపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.....

దిశ, వెబ్ డెస్క్: ఇరిగేషన్ అధికారుల(Irrigation Officials)పై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం(Sarvepalli Constituency)లో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(MLA Somireddy Chandramohan Reddy) అండతో ఇరిగేషన్ విభాగం ఎస్ఈ దేశీనాయక్, మేనేజర్ గంగాధర్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే తప్పు చేసిన అధికారులను విడిచిపెట్టమని హెచ్చరించారు. ఉద్యోగులు రిటైర్డ్ అయినా వదలిపెట్టమమని, వాళ్ల లెక్కలన్నీ సరి చేయిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆస్తులు మొత్తం అమ్మించి అవినీతిని కక్కిస్తామని కాకాణి వ్యాఖ్యానించారు.
అయితే వైసీపీ హయంలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతిని ఇటీవల సోమిరెడ్డి చంద్రబాబు మోహన్ రెడ్డి బయటపట్టారని, పనుల చేయకుండానే కాకాణి గోవర్ధన్ రెడ్డి బిల్లులు రూపంలో కోట్లు తీసుకున్నారని స్థానికులు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇరిగేషన్ శాఖలో జరిగిన రూ. 150 కోట్ల అవినీతికి సంబంధించిన ఆధారాలను సోమిరెడ్డిని బయటపెట్టారని, అందువల్లే కాకాణి గోవర్ధన్ రెడ్డి అధికారులపై రెచ్చిపోతున్నారని టీడీపీ నేతలు విమర్శలు చేశారు.






