మాజీ మంత్రి కాకాణికి చుక్కెదురు.. రిమాండ్‌ విధించిన సీబీఐ కోర్టు

by Kema Shiva Kumar |

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో పోలీసుల రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Goverdhan Reddy) మరో బిగ్ షాక్ తగిలింది.

మాజీ మంత్రి కాకాణికి చుక్కెదురు.. రిమాండ్‌ విధించిన సీబీఐ కోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో పోలీసుల రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Goverdhan Reddy) మరో బిగ్ షాక్ తగిలింది. టీడీపీ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై (Somireddy Chandra Mohan Reddy) సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆయన పరువు ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కాకాణి పోస్టింగ్‌లు పెట్టారు. ఈ అంశంపై స్థానిక టీడీపీ నేత మేకల నరేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో పీటీ వారెంట్‌పై కాకాణిని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకుని అక్కడి నుంచి భారీ భద్రత నడుమ మంగళగిరిలోని సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కాకాణికి 14 మాజీ మంత్రి కాకాణికి చుక్కెదురు.. రిమాండ్‌ విధించిన సీబీఐ కోర్టురోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

Next Story