ఒళ్లు తగ్గించుకుని, బుర్ర పెంచమంటే దాడులు చేస్తారా: జోగి రమేశ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-01 12:48:45  IST  )

మంత్రి నారా లోకేశ్‌ను ఒళ్లు తగ్గించుకుని బుర్ర పెంచమంటే దాడులు చేస్తారా అని మాజీ మంత్రి జోగి రమేశ్ ప్రశ్నించారు....

ఒళ్లు తగ్గించుకుని, బుర్ర పెంచమంటే దాడులు చేస్తారా: జోగి రమేశ్
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారా లోకేశ్‌(Minister Nara Lokesh)ను ఒళ్లు తగ్గించుకుని బుర్ర పెంచమంటే దాడులు చేస్తారా అని మాజీ మంత్రి జోగి రమేశ్(Former Minister Jogi Ramesh) ప్రశ్నించారు. విజయవాడ ఇబ్రహీంపట్నం(Vijayawada Ibrahimpatnam) నివాసంపై దాడి జరిగిన నేపథ్యంలో ఆయన స్పందించారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కాదని, ఎన్టీఆర్ పెట్టినది అని తాను అన్నానని దానికే అంత రాక్షస ఆనందం ఎందుకు అని నిలదీశారు. గతంలో తమ అధినేత, వైఎస్ మోహన్ రెడ్డిపై తీవ్రమైన, అసభ్యకరమైన విమర్శలు చేశారని, కానీ తాము ఏం చేయాలని జోగి రమేశ్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కాదన్నారు. రెండు రోజులుగా రాష్ట్రంలో విధ్వంసాలు, అరాచకాలు జరుగుతున్నాయని జోగి రమేశ్ వ్యాఖ్యానించారు.

ఇంటికి నిప్పు.. చంద్రబాబు, లోకేశ్‌కు జోగి రమేశ్ స్ట్రాంగ్ వార్నింగ్

Next Story