- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయనిష్టం.. ఎక్కడైనా పార్టీ ఆఫీసు పెట్టుకోవచ్చు: పవన్‌కు జగదీశ్‌రెడ్డి మద్దతు
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల హైదరాబాద్ మణికొండలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాలపై మాట్లాడటం, పోటీ చేయడం, పార్టీ కార్యాలయం ప్రారంభించడంపై తెలంగాణ వాదం పేరుతో కొందరు వ్యక్తులు విమర్శలు కురింపించారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఇటీవల హైదరాబాద్ మణికొండ(Hyderabad Manikonda)లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఏపీ డిప్యూటీ సీఎం(Ap Deputy Cm)గా ఉన్న పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాల(Telangana Politics)పై మాట్లాడటం, పోటీ చేయడం, పార్టీ కార్యాలయం ప్రారంభించడంపై తెలంగాణ వాదం పేరుతో కొందరు వ్యక్తులు విమర్శలు కురింపించారు. ఆంధ్రా వాళ్లకు తెలంగాణ రాజకీయాల్లో ఏం పని, అక్కడే చూసుకోవాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల సైతం హితవు పలికారు. పవన్ కల్యాణ్ సినిమాలను చూస్తున్నామని తెలంగాణ సెక్రటేరియట్ లో కూర్చుంటామని చూస్తూ ఊరికోమని కూడా వార్నింగ్ ఇచ్చారు. అటు బీఆర్ఎస్ నేతలు సైతం విమర్శలు కురిపించారు. తెలంగాణ సెక్రటేరియట్‌లో తమతో కూర్చుని పెత్తనం చేస్తామంటే ఒప్పుకోమని మాజీ మంత్రి కేటీఆర్ సైతం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి విమర్శించారు.
ఎక్కడైనా పార్టీ ఆఫీసు పెట్టుకోవచ్చు
అయితే తాజాగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి(Former Minsiter Jagadish Reddy) స్పందించారు. పవన్ కల్యాణ్ తెలంగాణలోనే కాదని.. దేశంలో ఎక్కడైనా పార్టీ ఆఫీసు పెట్టుకోవచ్చన్నారు. కొత్తగా పార్టీ ఆఫీస్ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఎప్పటి నుంచో ఉన్నారని, పవన్ కల్యాణ్, మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి అందరూ ఒక్కటేనని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు.






