మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు ఉహించని షాక్.. 6 నెలల జైలు శిక్ష

by Malleboina Mahesh |

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు 6 నెలల జైలు శిక్ష! 2016 నాటి ప్రత్యేక రైల్వే జోన్ దీక్ష కేసులో విశాఖ కోర్టు కీలక తీర్పు.

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు ఉహించని షాక్.. 6 నెలల జైలు శిక్ష
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు ఉహించని షాక్ తగిలింది. 10 సంవత్సరాల క్రితం కేసులో విశాఖ అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు జైలు శిక్ష విధిస్తూ శనివారం (ఏప్రిల్ 11, 2026) కీలక తీర్పు వెలువరించింది. సుమారు పదేళ్ల క్రితం నమోదైన ఒక కేసులో ఆయనకు 6 నెలల జైలు శిక్షతో పాటు రూ. 5,000 జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ వరలక్ష్మి తీర్పునిచ్చారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది.

అసలు కేసు ఏమిటంటే?

2016 ఏప్రిల్ 17న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ సాధించాలనే డిమాండ్‌తో గుడివాడ అమర్నాథ్ విశాఖలోని జీవీఎంసీ (GVMC) కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం దగ్గర నిరసన దీక్ష చేపట్టారు. అయితే, ఆ సమయంలో ఆయన చేసిన దీక్షను ఆత్మహత్యాయత్నంగా పరిగణిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై సుదీర్ఘ కాలంగా విచారణ సాగగా, తుది వాదనలు విన్న న్యాయస్థానం నేడు తీర్పును వెల్లడించింది. అయితే, ఈ తీర్పుపై గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ.. తాను ప్రజా సమస్యల కోసం పోరాటం చేశానని, న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో (High Court) అప్పీల్ చేయనున్నట్లు తెలిపారు.

Next Story