- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా కమిషన్ విచారణకు హాజరైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాత్
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళగిరిలో రాష్ట్ర మహిళ కమిషన్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. హోంమంత్రి అనితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ అమర్ నాథ్ ను మహిళా కమిషన్ విచారణకు పిలిచింది.

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళగిరిలో రాష్ట్ర మహిళ కమిషన్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. హోంమంత్రి అనితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ అమర్ నాథ్ ను మహిళా కమిషన్ విచారణకు పిలిచింది. అమర్నాథ్ తో పాటు ఆయన అడ్వకేట్ కూడా లోపలికి వెళ్లేందకు రాగా ఆయన్ని కూడా పోలీసులు అనుమతించారు. అమర్నాథ్ కు మద్దతుగా ఉత్తరాంధ్ర నుండి మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు కార్యాలయం బయట వాగ్వాదం నెలకొంది. విచారణకు హాజరయ్యే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. హోం మంత్రి అనితపై తాను చేసిన కామెంట్లలో ఎలాంటి తప్పు లేదని అన్నారు.
తాను ఎక్కడా మహిళలను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడలేదని చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు చేయడం సహజం అని అనితపై తాను చేసింది కూడా కేవలం రాజకీయ విమర్శమత్రమేనని క్లారిటీ ఇచ్చారు. టీడీపీ తన మాటలను వక్రీకరించి ఆందోళన చేపట్టిందని అన్నారు. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం కిలోల కొద్ది మేకప్ వేసుకుంటుంది.. అంటూ గుడివాడ అమర్నాథ్ హోమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశించింది. ఇప్పటికే రెండు సార్లు అమర్నాథ్‌ను విచారణకు పిలవగా ఆయన హారుకాలేదు. మూడోసారి విచారణకు ఆదేశించడంతో నేడు హాజరయ్యారు.






