లిక్కర్ కేసులో ‘బిగ్ బాస్’.. మాజీ మంత్రి సంచలన డిమాండ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-17 09:27:17  IST  )

ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

లిక్కర్ కేసులో ‘బిగ్ బాస్’.. మాజీ మంత్రి సంచలన డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు(Ap Liquor Scam Case)పై మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్(Former Minister Dokka Manikya Varaprasad) కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి టీటీడీ ఆలయంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసిన ఆయన లిక్కర్ స్కాంలో లక్షల కోట్లు అవినీతి జరిగినట్లు ఆరోపించారు. ఆ కేసులో అసలు బిగ్ బాస్‌ను చట్టం ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కల్తీ మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందని మండిపడ్డారు. రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్మించే శక్తిని సీఎం చంద్రబాబు నాయుడికి ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని తాను కోరుకున్నట్లు మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు.

కాగా లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా ప్రధాన సూత్రదారులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టు ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో అసలు బిగ్ బాస్‌ను చట్టం ముందుంచాలని మాజీ మంత్రి మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేయడం కలకలం రేపుతోంది. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి అలజడులు సృష్టిస్తుందో చూడాలి మరి.

Next Story