- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మంత్రి నారా లోకేష్ పై చర్యలు తీసుకోవాలి’.. మాజీ మంత్రి సంచలన డిమాండ్
రాష్ట్రంలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం పై కూటమి ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు కోనసాగుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం పై కూటమి ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు కోనసాగుతున్నాయి. జవాబు పత్రాల మూల్యాంకనం విషయంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై ఇటీవల వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి నారా లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని దుయ్యబట్టారు. ‘‘పదో తరగతి జవాబు పత్రాలు సరిగ్గా మూల్యాంకనం చేయలేని మీరు.. మిగతా వ్యవస్థలను ఇంకా ఎంతో ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతుందంటూ’’ ఇటీవల వైఎస్ జగన్ ఆరోపించారు.
అయితే.. ఈ అంశం పై వైసీపీ(YSRCP), టీడీపీ(TDP) మధ్య ఇంకా ఆరోపణలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ(Andhra Pradesh)లో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం లో అవకతవకలపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని వైసీపీ నేత, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రభుత్వపరంగా విద్యాసంస్థల్లో ఇచ్చే ఆడ్మిషన్లు వాయిదా వేయాలని కోరారు. విద్యాశాఖ నిర్వాకంపై ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh)తో సహా బాధ్యులైన అందరిపైనా చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.






