- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూటమి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్‌కు వాల్యూ లేదు: మాజీ మంత్రి
కూటమి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్‌కు వాల్యూ లేదు: మాజీ మంత్రి

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా(Dadisetti Raja) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్‌కు విలువ లేదని అన్నారు. వైసీపీ హయాంలో స్థానిక ఎస్పీతో ఇబ్బంది ఉంటే.. జగన్‌తో చెప్పి ట్రాన్స్‌ఫర్ చేయించానని గుర్తుచేశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ గగ్గోలు పెట్టినా కనీసం డీఎస్పీని కూడా ట్రాన్స్‌ఫర్ చేయించుకోలేకపోతున్నాడని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి వైసీపీ నేతల కీళ్లు విరుస్తానని బెదిరించడం చూస్తుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు.
కాగా, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఎందుకు ఆలస్యమవుతుందంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై నిన్న పవన్ కల్యాణ్ స్పందించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే బెదిరింపులకు భయపడలేదు. దౌర్జన్యాలకు దిగుతూ మళ్లీ వస్తామంటూ దిగజారి మాట్లాడుతున్నారు. రెండు రోజులు కిరాయి గూండాలు, రౌడీల వివరాలు ఆరా తీస్తే పరిస్థితి తెలుస్తుంది. రౌడీలపై రాజకీయ నిర్ణయం తీసుకుంటే మళ్లీ ఇలాంటి మాటలు రావు. ఆరోపణలు చేసేవారిని హెచ్చరిస్తున్నా.. రాజకీయ నిర్ణయం వరకూ తీసుకెళ్లొద్దు. అధికారం ఉన్నా.. లేకపోయినా.. పవన్ ఎప్పుడూ పవన్‌లానే ఉంటాడు. వైసీపీ రౌడీలకు యోగి ఆదిత్యనాథ్ వంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాలి’’ అని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తాజాగా పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై దాడిశెట్టి రాజా స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.






