ఆ సీఐను సస్పెండ్ చేయాల్సిందే: మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-12 06:48:11  IST  )

మాజీ మంత్రి విడుదల రజిని పట్ల సీఐ సుబ్బరాయుడు అమానుషంగా వ్యవహరించారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఆ సీఐను సస్పెండ్ చేయాల్సిందే: మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి విడుదల రజిని(Former Minister Vidudala Rajini) పట్ల సీఐ సుబ్బరాయుడు(Ci Subbarayudu) అమానుషంగా వ్యవహరించారని, ఆయన్ను వెంటనే సస్పెండ్ చేయాల్సిందేనని మాజీ మంత్రి దాడి శెట్టి రాజా(Former Minister Attacks Shetty Raja) డిమాండ్ చేశారు. తుని మండలం అన్నవరం వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి విడుదల రజని అనుచరుడి అరెస్ట్ సమయంలో సీఐ సుబ్బరాయుడు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. వ్యక్తిగతంగా తాను న్యాయపోరాటానికి దిగుతానని చెప్పారు. వైసీపీ నేతలపై కేసులు పెట్టడానికే చంద్రబాబు పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ మహిళా నేతల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని దాటిశెట్టి ఆరోపించారు.

Next Story