- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ex Minister: ‘సీజ్ ద షిప్’ అని జోక్ చేశారు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) విమర్శలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) విమర్శలు చేశారు. శుక్రవారం రాంబాబు మీడియాతో మాట్లాడారు. వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) కుమారుడు బెదిరించి పోర్టును లాక్కున్నారని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. మనుషుల్ని ఎలా వాడుకోవాలో చంద్రబాబుకు బాగా తెలుసని.. పవన్ కల్యాణ్‌ను చాలా వ్యూహాత్మకంగా వాడుతున్నారని విమర్శించారు. ఆ వ్యూహంలో భాగంగానే ‘సీజ్ ద షిప్’ డైలాగ్ వేశారని సెటైర్లు వేశారు. చంద్రబాబు అధికారంతో పాటు వేలాది కోట్లను లోకేష్(Lokesh)కు అప్పగించాలని చూస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. ఇవాళ్టి వైసీపీ(YCP) ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన వినతిపత్రాల కార్యక్రమం వాయిదా పడిందని అన్నారు.
ఈనెల 13వ తేదీన రైతుల సమస్యలపై వినతిపత్రాలు ఇస్తామని ప్రకటించారు. రేషన్ బియ్యం(Ration Rice) అక్రమ రవాణాపై ప్రభుత్వం ఎన్ని సిట్(SIT)లు ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికే టీటీడీ లడ్డుపై సిట్, గంజాయిపై ఈగల్, ఇప్పుడు రైస్‌పై సిట్.. ఇవన్నీ ప్రచారం కోసం తప్ప ఏం లేదన్నారు. చంద్రబాబు సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా ఎన్నికల్లో హామీలు ఇచ్చారని.. ఏ హామీ నెరవేర్చక ప్రజల్లో వ్యతిరేకత పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని రాంబాబు వ్యాఖ్యానించారు.






