మీరొచ్చాకే సమస్యలు: కులం పంచాయితీపై మాజీ మంత్రి స్ట్రాంగ్ కౌంటర్

by Vemula.Srinu Prasad |

మంత్రి వాసంశెట్టి సుభాశ్‌కు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు...

మీరొచ్చాకే సమస్యలు: కులం పంచాయితీపై మాజీ మంత్రి స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే శెట్టి బలిజ కులానికి సమస్యలు వచ్చాయని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు(Former Minister Chelluboyina Venu) అన్నారు. శెట్టి బలిజ కులం(Setty Balija Caste)పై మంత్రి వాసంశెట్టి సుభాశ్(Minister Vasansetty Subhash) చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వాసంశెట్టి సుభాశ్‌కు విషయ పరిజ్ఞానం లేదన్నారు. కులంపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉండాలన్నారు. ఆరోపణలు నిరూపించాలని లేనిపక్షంలో శెట్టిబలిజ కులానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి శెట్టి సుభాశ్ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించి శెట్టి బలిజ కులాన్ని తిడుతున్నారని మండిపడ్డారు. కులానికి ఎవరు ఏం చేశారో చర్చించేందుకు తాను సిద్ధమని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు సవాల్ విసిరారు.

కాగా శెట్టిబలిజ కులానికి మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు అన్యాయం చేశారని మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఆరోపించారు. సొంత కులంపై మెమో ఎందుకు తీసుకురావాలని ప్రశ్నించారు. గీత ఉపకులాలను చెల్లుబోయిన వేణు పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. వేషదారణ చేశారు తప్ప ఏమీ చేయలేదని మంత్రి వాసంశెట్టి సుభాశ్ విమర్శించారు.

Next Story