అసలు అప్పు ఎంతుందో చెప్పాలి: మాజీ మంత్రి బుగ్గన డిమాండ్

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర 2026-27 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు...

అసలు అప్పు ఎంతుందో చెప్పాలి: మాజీ మంత్రి బుగ్గన డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర 2026-27 వార్షిక బడ్జెట్‌(Annual Budget 2026-27)ను అసెంబ్లీ(Assembly)లో మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula Keshav) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్‌పై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(Former Minister Buggana Rajendranath Reddy) స్పందించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్‌లో కొత్తగా ఏమీ ఇవ్వలేదన్నారు. తమ హయాంలో చేసిన అప్పులపై అన్ని అబద్దాలే చెప్పారని బుగ్గన విమర్శించారు. గత సంవత్సరం ప్రవేశపెట్టి బడ్జెట్ మాదిరిగానే ఉందని తెలిపారు. బడ్జెట్‌లో ఊహాజనితమైన లెక్కలే ఉన్నాయని ఎద్దేవా చేశారు. పది సంవత్సరాల అనాలసిస్‌తో ఆదాయాలు, అప్పులు ఉంటాయని, అసలు అప్పు ఎంతుందో చూపడం లేదన్నారు. తమ ప్రభుత్వానికి విధ్వంసం అన్నారని, మరి కూటమి వికాసం ఏమైందని ప్రశ్నించారు. కార్పొరేషన్లలో ఇప్పటివరకూ ఎన్ని నిధులు వాడారో వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని బుగ్గన డిమాండ్ చేశారు.

Next Story