- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ లెక్క చెప్పాల్సిందే: బొత్స కీలక డిమాండ్
కేంద్రం నుంచి తీసుకొచ్చిన అప్పులపై లెక్క చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నిలదీశారు.

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం(Kutami Government)పై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Mlc Bosta Satyanarayana) ఫైర్ అయ్యారు. వేల కోట్ల అప్పులు తీసుకురావడాన్ని ఆయన తప్పు బట్టారు. అలాగే ప్రభుత్వంపై ప్రశ్నలు కురిపించిన జగన్(ys Jagan)ను బొత్స సమర్థించారు. జగన్ అడిగిన అన్ని ప్రశ్నలకు చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనన్నారు. సూపర్-6(Super-6) హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాలేదని విమర్శించారు. రూ.లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చారు కానీ.. ఉపాధిహామీ కూలీలకు డబ్బులు ఇవ్వడంలేదని బొత్స పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలు అవస్థలు పడుతున్నాయన్నారు. ప్రజల గురించి కూటమి నాయకులు అసలు పట్టించుకోవడంలేదన్నారు. రైతు పంటకు గిట్టుబాటు ధర లేదని విమర్శించారు. గిట్టుబాటు ధరలు కల్పించకుండా ప్రభుత్వం ఏం చేస్తోందని, ప్రజలు, రైతులను విస్మరించడం కూటమి ప్రభుత్వానికి సరికాదని మాజీ మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.






