వైసీపీలో కీలక పరిణామం.. మాజీ మంత్రి బొత్స సీరియస్

by Vemula.Srinu Prasad |

పార్టీని వీరే సొంత కార్పొరేటర్లపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ అయ్యారు...

వైసీపీలో కీలక పరిణామం.. మాజీ మంత్రి బొత్స సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysrcp)కి వలసల బెడద పట్టుకుంది. ఆ పార్టీకి చెందిన నేతలు వరుసగా కూటమిలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు టీడీపీ(Tdp), జనసేన(Janasena) పార్టీల్లో చేరిపోయారు. మరికొందరు కూడా వైసీపీ(Ycp)కి గుడ్ బై చెబుతారనే ప్రచారం జరుగుతోంది. విశాఖ మేయర్(Vishaka Mayor)పై కలెక్టర్‌కు కూటమి కార్పొరేటర్లు అవిశ్వాసం నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(MLC Botsa Satyanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని, విశాఖ కార్పొరేషన్‌లో పార్టీ మారే కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తామని ఆయన హెచ్చరించారు. పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రావాలని టీడీపీ చెప్పిందని, ఆ మాటకు కట్టుబడి ఉండాలని సూచించారు. దౌర్జన్యాలు, అరాచకాలకు కూటమి నాయకులు పాల్పడుతున్నారని, రాష్ట్రాన్ని బిహార్‌లా మార్చాలని చూస్తున్నారని, పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని బొత్స మండిపడ్డారు.

Next Story