శ్రీవాణి ట్రస్ట్‌ ఆలోచన జగన్‌దే: మాజీ మంత్రి భూమన

by Vemula.Srinu Prasad |

శ్రీవాణి ట్రస్ట్‌ ఆలోచన జగన్‌దేనని మాజీ మంత్రి భూమన అన్నారు...

శ్రీవాణి ట్రస్ట్‌ ఆలోచన జగన్‌దే: మాజీ మంత్రి భూమన
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీవాణి ట్రస్ట్ నిధుల(Srivani Trust funds)పై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం వల్లే నిధులు దుర్వినియోగం అయినట్లు కూటమి నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలకు మాజీ మంత్రి భూమన(Former Minister Bhumana) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శ్రీవాణి ట్రస్ట్‌ ఆలోచన జగన్‌దేనన్నారు. ట్రస్ట్ నిధులతో ఆలయాలు నిర్మించాలనేది వైఎస్ జగన్‌(Ys Jagan) ఆలోచన అని చెప్పారు. జగన్‌ ఆలోచన వల్లే ట్రస్ట్‌కి రూ.2 వేల కోట్లు వచ్చాయన్నారు. ఈ నిధులతోనే తమ హయాంలో చాలా ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించామని చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్‌పై చంద్రబాబు(Chandrababu), పవన్‌(Pawan) విషం చిమ్మారని తెలిపారు. నిధులు తాడేపల్లి వెళ్తున్నాయని దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. ఇప్పుడు నిధులు చంద్రబాబు ఇంటికి వెళ్తున్నాయని, ఇప్పుడు ట్రస్ట్ ఆలోచన తనదేనని చంద్రబాబు అంటున్నారని భూమన ఎద్దేవా చేశారు.

Next Story