ఒంగోలులో నా ఓటమికి పవన్ కారణం: జనసేన మీటింగ్‌లో బాలినేని సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-09 11:19:00  IST  )

తాను వైసీపీలో ఉన్నప్పుడు మంత్రి పదవి వదులుకుని వైఎస్ జగన్ కోసం ఎంతో చేశాని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు..

ఒంగోలులో నా ఓటమికి పవన్ కారణం: జనసేన మీటింగ్‌లో బాలినేని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తాను వైసీపీ(Ycp)లో ఉన్నప్పుడు మంత్రి పదవి వదులుకుని వైఎస్ జగన్(Ys Jagan) కోసం ఎంతో చేశాని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Former Minsiter Balineni Srinivasaraeddy) అన్నారు. ఒంగోలు(Ongole)లో ఆయన మాట్లాడుతూ జగన్ కోసం తాను చాలా చేశానని, కానీ ఎప్పుడు కూడా బహిరంగ సమావేశాల్లో జగన్ తన గురించి మాట్లాడలేదన్నారు. జగన్‌ని తాను ఎక్కువ ప్రశ్నించేవాడిని, అందుకే తన మంత్రి పదవి పోయిందని తెలిపారు. ఇక తాను ఒంగోలులో 7 సార్లు పోటీ చేస్తే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. కానీ రెండు సార్లు ఓడిపోవడానికి పవన్ కల్యాణ్ కారణం అని చెప్పారు. ఒంగోలులో రెడ్డి సామాజిక వర్గం తక్కువ అని, కమ్మ, కాపు ఎక్కువని తెలిపారు. టీడీపీకి పవన్ కల్యాణ్ రెండుసార్లు సపోర్ట్ చేశారని, అందుకే తాను రెండు సార్లు ఓడిపోయానని బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Next Story