- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్‌పై అప్పుడెందుకు కేసు పెట్టలేదు: మాజీ మంత్రి అప్పలరాజు
తెలంగాణలో పవన్ కారు ఢీకొని వ్యక్తి చనిపోయినప్పుడు కేసు పెట్టలేదని మాజీ మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు..

దిశ, వెబ్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి జగన్(Former Chief Minister Jagan) కారు(Car) ఢీకొని సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల(Rentapalla)లో సింగయ్య మృతి చెందడంపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే జగన్‌పైనా కేసు నమోదు కావడాన్ని మాజీ మంత్రి అప్పలరాజు(Former Minister Appala Raju) తప్పుబట్టారు. అంతేకాదు గతంలో పవన్ కల్యాణ్(Pawan Kalyan) పర్యటనలో జరిగిన సంఘటనను గుర్తు చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో పవన్ కారు ఢీకొని తెలంగాణలో ఒకరు చనిపోయారని, ఆయనపై అప్పుడు కేసు ఎందుకు పెట్టలేదని అప్పలరాజు నిలదీశారు. అప్పుడో న్యాయం.. ఇప్పుడో న్యాయమా అని ప్రశ్నించారు. చంద్రబాబు కారు ఢీకొని రెండు సార్లు ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని, మరి ఆయనపై ఎందుకు కేసు నమోదు చేయలేదని అప్పలరాజు నిలదీశారు.
గత ఐదేళ్లలో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలను వైసీపీ నేతలు తరిమేశారని టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారానికి అప్పలరాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పారిశ్రామికవేత్తలను చంద్రబాబే తరిమేశారన్నారు. జిందాల్ స్టీల్‌ను చంద్రబాబు బెదిరించి తరిమేశారని ఆరోపించారు. అనకాపల్లి కోకోకోలా కంపెనీపై అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలనూ చంద్రబాబు, టీడీపీ నేతలు తరిమేశారని అప్పలరాజు ఆరోపించారు. ఆల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి దాడులు చేస్తే కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. యోగాంధ్ర విఫలం కావడంతోనే జగన్ పల్నాడు పర్యటనపై ఆరోపణలు చేశారని వ్యాఖ్యానించారు. ఒక మార్ఫింగ్ వీడియోను తెరపైకి తీసుకొచ్చి మాజీ సీఎం అయిన జగన్‌పై కేసు నమోదు చేశారని అప్పలరాజు ధ్వజమెత్తారు.






