16 నెలల్లో రూ. 2.5 లక్షల కోట్ల అప్పు.. ప్రభుత్వంపై అప్పలరాజు ఆగ్రహం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-05 11:06:32  IST  )

16 నెలల్లో ప్రభుత్వం రూ. 2.5 లక్షల కోట్లు అప్పుడు చేసిందని మాజీ మంత్రి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు...

16 నెలల్లో రూ. 2.5 లక్షల కోట్ల అప్పు.. ప్రభుత్వంపై అప్పలరాజు ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: 16 నెలల్లో ప్రభుత్వం రూ. 2.5 లక్షల కోట్లు అప్పు చేసిందని మాజీ మంత్రి అప్పలరాజు(Former Minister Appalaraju) ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీఏ(PPA) విధానంలో మెడికల్ కాలేజీల(Medical Colleges) నిర్మాణాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Ysrcongress Party)వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఇదే విషయంపై మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. కొన్ని రోజులుగా నిరసలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్లు అప్పులు చేస్తూ ప్రజా సంపదను ప్రభుత్వం దోచుకుంటోందని ఆరోపించారు. జగన్ హయాంలో రూ. 3 లక్షల 30 వేల అప్పు తీసుకొచ్చామని, కానీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే 2.5 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. రెండు ప్రభుత్వాల్లో ఏది విధ్వంసానికి పాల్పడిందని ప్రశ్నించారు. తమ హయాంలో స్కూళ్లను అభివృద్ధి చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ నాయకులు వాటిని శిథిలావస్థకు చేరేలా చేశారని మాజీ మంత్రి అప్పలరాజు మండిపడ్డారు.

Next Story