Ex Minister: పోసాని కృష్ణ మురళి ఒంటరి కాదు.. మేము అండగా ఉంటాం

by Gantepaka Srikanth |

వైసీపీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) అరెస్ట్‌పై ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ex Minister Ambati Rambabu) స్పందించారు.

Ex Minister: పోసాని కృష్ణ మురళి ఒంటరి కాదు.. మేము అండగా ఉంటాం
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) అరెస్ట్‌పై ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ex Minister Ambati Rambabu) స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోసానిని ఒంటరిగా వదిలేయబోమని.. తప్పకుండా అండగా నిలబడతామని అన్నారు. రెడ్ బుక్ పేరిట వైసీపీ నేతలను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని తెలిపారు. అనిత(Home Minister Anitha)ను పక్కకు నెట్టి.. హోంమంత్రిగా నారా లోకేష్(Nara Lokesh) వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు.

ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్లు పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. వేర్వేరు చోట్ల కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు పోసాని కృష్ణమురళికి నరసరావుపేట కోర్టు 10 రోజుల రిమాండ్ విధించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై టీడీపీ నేత కిరణ్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోసానిని అదుపులోకి తీసుకున్న పల్నాడు పోలీసులు సోమవారం సాయంత్రం నరసరావుపేట కోర్టులో హాజరుపర్చగా.. విచారణ చేపట్టి మార్చి 13 వరకు రిమాండ్ విధించింది.

Next Story