Nellore: మాజీ మంత్రి అనిల్‌‌కు ప్రశ్నల వర్షం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-04 11:12:11  IST  )

మాజీ మంత్రి అనిల్ కుమార్‌కు నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది...

Nellore: మాజీ మంత్రి అనిల్‌‌కు ప్రశ్నల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: గత నెల 26న నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి(Kovur MLA Vemireddy Prashanthi Reddy)పై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి(Former MLA Prasanna Kumar Reddy) అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే అదే వేదికపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్(Former Minister Anil Kumar Yadav) సైతం ఉన్నారు. దీంతో ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ పైనా కేసు నమోదు అయింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఆ సమయంలో గడువు కోరారు. తాజాగా నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో సోమవారం అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు ఆయన్ను విచారిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న కారణాలపై ప్రశ్నిస్తున్నారు. విచారణ అనంతరం అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది

Next Story