- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లపురెడ్డి ఇంటిపై దాడి.. మాజీ మంత్రి అనిల్ కీలక వ్యాఖ్యలు
మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడిని మాజీ మంత్రి అనిల్ కుమార్ ఖండించారు. ...

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి(TDP MLA Vemireddy Prashanthi Reddy)పై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి(Former MLA Nallapureddy Prasanna Kumar Reddy) చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కోవూరులోని ఆయన నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంటి ఫర్నీచర్‌తో పాటు బయట పార్క్ చేసిన కారును ధ్వంసం చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలే చేశారని ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు. వేమిరెడ్డి దంపతులే తన ఇంటిపై దాడి చేయించారని వ్యాఖ్యానించారు. సాక్ష్యాలు, వీడియోలు చూపించినా కేసు పెట్టలేదన్నారు. తాను తలుచుకుంటే 10 వేల మందితో వెళ్లి వేమిరెడ్డి ఇల్లు కూల్చి ఎత్తుకురాగలనని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఖండించారు. దాడి జరిగింది క్లియర్‌గా కనిపిస్తోందని, కానీ టీడీపీ నేతలకు పోలీసుల వత్తాసు పలుకుతున్నారన్నారని మండిపడ్డారు. నల్లపురెడ్డి ప్రసన్న నివాసం దాడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని కేసు పెట్టారని ఆరోపించారు. వీడియోలో కనిపించినవారిపై కేసులు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.






