- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనింగ్ కేసులపై సమాధానం చెప్పాలిందే: మాజీ మంత్రి అనిల్ డిమాండ్
మైనింగ్ కేసులపై ఎంపీ వేమిరెడ్డి సమాధానం చెప్పాలిందేనని మాజీ మంత్రి అనిల్ డిమాండ్ చేశారు..

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా(Nellore District)లో అక్రమంగా మైనింగ్ చేస్తున్న వారిపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్(Former Minister Anil Kumar Yadav) మండిపడ్డారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy)పై అక్రమంగా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ మాఫియా(Mining Mafia) అరాచకాలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. ఉపాధి లేక వందలమంది రోడ్డున పడ్డారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(Mp Vemireddy Prabhakar Reddy) సమాధానం చెప్పాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని సూచించారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో జరుగుతున్న మైనింగ్ పై తమపై బురద చల్లుతున్నారన్నారు. తాము అక్రమమైనింగ్ చేయలేదని, అంతా దేవుడే చూసుకుంటారని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.






