నా పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా: ఎమ్మెల్సీ బొత్స ఆగ్రహం

by Vemula.Srinu Prasad |

తన పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు...

నా పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా: ఎమ్మెల్సీ బొత్స ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: తన పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Bosta Satyanarayana) ఆగ్రహం వ్యక్తం చేశారు. పైడితల్లి అమ్మవారి జాతర(Paiditalli Ammavari Jathara)లో వేదిక కూలిన ఘటనపై ఆయన సీరియస్ అయ్యారు. పైడితల్లి అమ్మవారి జాతర సరిగా జరగలేదని ఆరోపించారు. తనపై కుట్ర జరిగిందా.. అలసత్వమా అనేది తేల్చాలన్నారు. తాను కూర్చున్న వేదిక కూలి పలువురికి గాయాలయ్యాయని తెలిపారు. ప్రతిపక్ష నేత పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. గవర్నర్‌కి లేఖ రాసి వివరణ కోరతామన్నారు. ఘటనపై ఇప్పటికే సీఎస్‌కు లేఖ పంపానని తెలిపారు. పండగ కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో హుండీలు పెట్టారని, బలవంతంగా వసూళ్లకు పాల్పడ్డారని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

Next Story