విచక్షణ కోల్పోయిన ఎమ్మెల్యే గంటా.. ప్రభుత్వ ఉద్యోగిపై ఘాటు వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-10 14:24:29  IST  )

మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహనం కోల్పోయారు...

విచక్షణ కోల్పోయిన ఎమ్మెల్యే గంటా.. ప్రభుత్వ ఉద్యోగిపై ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(MLA Ganta Srinivasa Rao) సహనం కోల్పోయారు. ప్రభుత్వ ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పళ్లు రాల కొడతా రాస్కెల్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. గాడిదలు కాస్తున్నారా, కళ్లు కనిపించడం లేదా అంటూ ధ్వజమెత్తారు. క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లిన గంటా శ్రీనివాసరావును పలువురు మహిళలు కలిశారు. ఎండాడ రాజీవ్ నగర్‌లో మంచి నీరు, డ్రైనేజీ సమస్యను వివరించారు. చాలా రోజుల నుంచి పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు.

దీంతో శానిటరీ ఉద్యోగి రవికి ఫోన్ చేసి పిలిపించారు. నీటి, డ్రైనేజీ సమస్యపై ఆరా తీశారు. అయితే శానిటరి ఉద్యోగి పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన గంటా శ్రీనివాసరావు.. తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేరా అంటూ మండిపడ్డారు. నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఉద్యోగుల పట్ల ఎమ్మెల్యే తీరు సరికాదనే అభిప్రాయం వినిపిస్తోంది.

Next Story