ఎవరిని వదిలిపెట్టం.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం: అంబటి వార్నింగ్

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో మాజీ మంత్రి ఇంటిపై 7 గంటల పాటు దాడి జరిగితే పోలీసులు ఏం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు....

ఎవరిని వదిలిపెట్టం.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం: అంబటి వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minsiter Ambati Rambabu) అన్నారు. గుంటూరు(Guntur)లో మాజీ మంత్రి ఇంటిపై 7 గంటల పాటు దాడి జరిగితే పోలీసులు ఏం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. జిల్లా ఎస్పీ, ఏసీపీకి ఫోన్ చేస్తే తమకు పనులు ఉండవా అని సమాధానం ఇచ్చారని, ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదని మండిపడ్డారు. ఇప్పటికైనా సరే తన ఇంటిపై దాడి చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

Next Story