నేను చేసిన ఆరోపణలపైనా విచారణ జరపండి: అంబటి రాంబాబు

by Vemula.Srinu Prasad |

తాను చేసిన ఆరోపణలపైనా విచారణ జరపాలని, తన ఇంటిపై దాడి జరిగితే పోలీసులు చోద్యం చూశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు..

నేను చేసిన ఆరోపణలపైనా విచారణ జరపండి: అంబటి రాంబాబు
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీవారి లడ్డూ తయారీ(Srivari Laddu Making)లో వినియోగించిన నెయ్యి వ్యవహారం(Ghee affair)పై సిట్ రిపోర్టు(SIT Report)ను కోర్టు(Court) సమర్పించిన నేపథ్యంలో రాష్ట్రంలో వైసీపీ(Ycp), టీడీపీ(Tdp) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. అయితే సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu)పై మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) అసభ్య వ్యాఖ్యలు చేయడంతో గుంటూరు(Guntur)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన నివసిస్తున్న ఇంటిపై కొందరు టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారు. పెట్రోల్ బాంబులు విసిరారు. ఇంటి ఫర్నీచర్‌ను తగులబెట్టారు. ఇంతలోనే సీఎంను దూషించినందుకు అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. రిమాండ్ ఖైదీగా జైలులో ఉంచి బెయిల్ పై విడుదలయ్యారు.

నా ఇంటిపై దాడి జరిగితే...

అయితే తన ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తన ఇంటిపై దాడి జరిగితే పోలీసులు చోద్యం చూశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కావాలనే కుట్ర చేశారని ఆరోపించారు. నమోదైన అన్ని కేసులు బెయిలబుల్ సెక్షన్లేనని తెలిపారు. ఓ సామాజిక వర్గాన్ని మీరు రెచ్చగొట్టలేదా అని ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చుపెట్టే సంస్కృతి తనది కాదన్నారు. తాను చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

Next Story