నన్ను ఫిజికల్‌గా హరాస్‌మెంట్ చేశారు: అంబటి రాంబాబు

by Vemula.Srinu Prasad |

సీఎం చంద్రబాబుపై తాను చేసిన దూషణలు కేసులో తనను ఫిజికల్‌గా హరాస్‌మెంట్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ..

నన్ను ఫిజికల్‌గా హరాస్‌మెంట్ చేశారు: అంబటి రాంబాబు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(Cm Chandrababu)పై తాను చేసిన దూషణలు కేసు(Insults case)లో తనను ఫిజికల్‌గా హరాస్‌మెంట్(Harassment) చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) అన్నారు. తనను అరెస్ట్ చేసిన రోజు రాత్రి సమయంలో పోలీసులు లాకప్ నుంచి బయటకు తీసుకెళ్లారని తన రెండు కాళ్లు చీల్చి హింసించారని ఆయన పేర్కొన్నారు. తనను కస్టోడియల్ టార్చర్ చేశారని ఆరోపించారు. దీనిపై తాను న్యాయ పోరాటం చేయబోతున్నామని తెలిపారు. 5 ఏళ్ల ప్రభుత్వంలో పని చేసిన తనన్నే ఫిజికల్ హరాస్‌మెంట్ చేశారంటే, సామాన్యుల పరిస్థితి ఏంటి అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

కోర్టులో ప్రవేశపెట్టిన రోజు...

తనకు జరిగిన అన్యాయంపై తనను కోర్టులో ప్రవేశపెట్టిన రోజు జడ్జి ఎదుట అన్ని చెప్పానని, రికార్డు కూడా చేయించానని అంబటి రాంబాబు తెలిపారు. న్యాయస్థానం అంటే తమకు గౌరవం ఉందన్నారు. తన ఇంటిపై జరిగిన దాడి చేసిన నిందితులను మాత్రం బెయిల్ ఇచ్చి వదిలిపెట్టారని, తనను అమాత్రం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారని పేర్కొన్నారు. తన ఇంటికి నిప్పు పెట్టిన వాళ్లు సింపుల్‌గా స్టేషన్ బెయిల్‌పై విడుదలయి ఇంటికి వెళ్లిపోయారని తెలిపారు. మూడు ప్రధానమైన కారణాలతో తాము న్యాయ పోరాటం చేయబోతున్నామని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు.

Next Story